HealthHome Page SliderNational

ఈ పళ్లతో కలిపి పాలు తాగితే అమృతం తాగినట్లే..

చలి కాలంలో లభించే అంజీర్ పళ్లు ఎన్నో పోషకాలతో కూడి ఉంటాయి. ఈ పళ్లను పాలలో కలిపి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యమూ దరిచేరలేదని వైద్యులు చెప్తున్నారు. ఇది సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఇలా అంజీర్ పాలు తాగితే అమృతం తాగినట్లేనని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు.  ఈ పాలు తాగడం వల్ల శరీరంలో సహజ ఎంజైములు తయారవుతాయి. శరీరబరువును నియంత్రణలో పెడతాయి. ఈ పాలు తాగడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సమస్యలు తొలగిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనిని తెలుగులో అత్తి పళ్లు అని కూడా అంటారు. రాత్రి సమయంలో ఈ పాలు తాగితే నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం లభించి మంచి నిద్ర పడుతుంది.