జైషే మహ్మద్ మహిళా విభాగం చీఫ్‌గా డాక్టర్ షాహీన్ అరెస్ట్
ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన డా. షాహీన్, దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్ (Jaish-e-Mohammed Women’s Wing) ను నడిపిస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
సమాచారం ప్రకారం, షాహీన్‌కు జైషే మహ్మద్ స్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో నేరుగా సంబంధాలున్నాయి. ఆమె ఆదేశాల మేరకు షాహీన్ దేశంలోని మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతున్నట్లు విచారణలో తేలింది.
2009లో షాహీన్ కన్నౌజ్ మెడికల్ కాలేజీలో పనిచేసిన సమయంలో అమాయకంగా, క్రమశిక్షణతో వ్యవహరించిందని ఆ కాలేజీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పాత్ర, ఉగ్ర సంస్థలతో అనుబంధం భద్రతా ఏజెన్సీల దృష్టిని ఆకర్షిస్తోంది.

