Andhra PradeshHome Page SliderNews Alert

తిరుపతిలో డబుల్ ధమాకా..

ఒకే రూపంతో, పోలికలతో చూసేవారిని అయోమయానికి గురిచేస్తుంటారు కవల పిల్లలు. వారికి గుర్తుగా ఒక దినోత్సవాన్ని ప్రతీ ఏటా తిరుపతిలో ఫిబ్రవరి 22న నిర్వహిస్తారు. ఒక ప్రైవేట్ సంస్థ ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. దీనితో ఈ డబుల్ ధమాకాను చూడడానికి ఎంతో మంది వస్తూంటారు. ట్విన్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం కేవలం తిరుపతి జిల్లాలోనే 12 వేల మంది కవలలు ఉన్నారట. వీరందరూ ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలలో పని చేస్తున్నా, ఈ రోజున మాత్రం తిరుపతికి వచ్చి ఈ వేడుకలో సరదాగా పాల్గొంటారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. దీనికోసం కడప, తిరుపతి, బెంగళూరు, వడమాల పేట, చిల్లకూరు, చిత్తూరు వంటి ప్రాంతాల నుండి ఎందరో వచ్చారు.