Home Page SliderTelangana

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం-ఈటల,కోమటిరెడ్డి గైర్హాజరు

బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇంటింటికీ బీజేపీ. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో బాగంగా కేంద్రంలో  బీజేపీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించాలనేదే దీని ముఖ్యఉద్దేశం. తెలంగాణాలో బీజేపీ బూత్ స్థాయి నుండి, ఎమ్మెల్యే, ఎంపీల వరకూ ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఒక్కరోజులో 35 లక్షల ఇళ్లను సందర్శించాలని పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రబీజేపీ ముఖ్యనేతలైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు అవడం సంచలనం రేకెత్తిస్తోంది. వీరిద్దరూ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ పార్టీ ఈ నెల 30 వరకూ ఈ కార్యక్రమం చేయాలన్నారు బండిసంజయ్. ఇకపై కూడా మినీ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇస్తామని, ఇవ్వలేదంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రాష్ట్రపార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌లో బండి సంజయ్, ముషీరాబాద్‌లో లక్ష్మణ్ చాలా బిజీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, కీలక నేతలైన వీరిద్దరూ ఎందుకు హాజరు కాలేదన్న సందేహాలు కలుగుతున్నారు.