Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

గుంటూరు తెలివితేట‌లు ఇక్క‌డ చూపించొద్దు

గుంటూరు తెలివి తేట‌లు ఇక్క‌డ చూపించొద్దంటూ మాజీ మంత్రి కేటిఆర్,హ‌రీష్ రావుల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శ‌నివారం జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న పాల్గొన్నారు.మార్నింగ్ సెష‌న్‌లో కేటిఆర్ మాట్లాడ‌గా… మిడ్ డే సెష‌న్‌లో రేవంత్ మాట్లాడు. తెలంగాణ అసెంబ్లీ ఏర్ప‌డ్డాక ఇంత ఛీద‌ర స‌మావేశాలు ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. కేసిఆర్‌,ఈట‌ల చూసిన‌ప్పుడు ఆర్ధిక శాఖ ఎంతో బాగుంద‌ని,కానీ హ‌రీష్ రావు చూస్తున్నాక రాష్ట్రం భ్ర‌ష్టుప‌ట్టిపోయింద‌న్నారు.బావా బావ‌మ‌రుదులు ఇద్ద‌రికీ తాను ఒక‌టే స‌వాల్ విసురుతున్నా అన్నారు.ద‌మ్ముంటే గ‌న్‌మెన్‌లు లేకుండా మూసీ న‌ది ద‌గ్గ‌ర‌కు వెళ్దామా అని స‌వాల్ విసిరారు.తాను ,రాజ‌గోపాల్ రెడ్డి ఇద్ద‌రం గ‌న్ మెన్ లు లేకుండా వ‌స్తామ‌న్నారు.తాను తండ్రి పేరు చెప్పుకుని ఇక్క‌డ‌కు రాలేద‌ని,” మీ గుంటూరు తెలివి తేట‌లు నా ద‌గ్గ‌ర చూపించొద్దు అంటూ కేటిఆర్‌,హ‌రీష్ రావుల‌పై నిప్పులు చెరిగారు. ప్ర‌తీదానికి స‌వాల్ అంటారు…మేము స‌వాల్ విస‌రితే బ‌య‌ట‌కు రారు. పేప‌ర్లు దిద్ద‌డం కూడా చేత‌గాని ప్ర‌భుత్వం మీది అందుకే మిమ్మ‌ల్ని చిత్తుకాగితాల క‌న్నా దారుణంగా ఓడించారు తెలంగాణ ప్ర‌జ‌లు ” అని రేవంత్ గ‌ట్టిగా వ్యాఖ్యానించారు.