‘ఈ ఏడాది ఆ పంట వెయ్యొద్దు’..చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పంట గిట్టుబాటు ధరలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది హెచ్‌డీ బర్లే రకానికి చెందిన పొగాకు పంటను వేయొద్దని, దానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం డిమాండ్ లేని పంటలు వేయొద్దని, డిమాండ్ ఉన్న పంటలే సాగుచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సూచించారు. అలాగే పండ్ల జ్యూస్‌లపై జీఎస్టీలు తగ్గిస్తున్నామని, మిడ్ డే మీల్స్ పథకంలో, టీటీడీ ప్రసాదంలో భాగంగా మ్యాంగో జ్యూస్‌ను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.