ముస్లింలను బీసీల్లో కలపొద్దు….
తెలంగాణ కులగణన సర్వే ఓ బోగస్ అని ముస్లింలను బీసిల్లో కలిపి …బీసిలకు తీరని అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల కారణంగా తెలంగాణ సమాజం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో 10శాతం ఉన్న ముస్లింలను బీసిల్లో కలిపితే బీసిలు ఆర్ధికంగా,సామాజికంగా నష్టపోతారని హెచ్చరించారు.తానే కాదు…ఈ విషయంలో కేంద్రం కూడా ఒప్పుకోదని స్పష్టం చేశారు.

