తెలీదు…గుర్తు లేదు…మర్చిపోయా
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతంతా ఒక్కొక్కరిగా విచారణకు హాజరవుతున్నారు.గత మూడు రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య …జూబిలి హిల్స్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాగా తాజాగా నోటీసులు అందుకున్న కల్వకుర్తికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శనివారం జూబిలి హిల్స్ ఏసిపి ఎదుట విచారణకు హాజరయ్యారు.తెలీదు…గుర్తు లేదు…మర్చిపోయా అంటూ మొన్న విచారణలో చిరుమర్తి లింగయ్య బదులివ్వగా…జైపాల్ ఏం చెప్పి ఉంటాడా అని అంతా సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు.