పాకిస్థాన్‌కు వెళ్లొద్దు..అక్కడి నుండి రావొద్దు..
పాకిస్థాన్‌కు ప్రయాణం విషయంలో అమెరికా ప్రభుత్వం పౌరులపై ఆంక్షలు విధిస్తోంది. అమెరికా పౌరులెవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ప్రయాణానికి సిద్ధం చేసుకున్నవారికి కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దంటూ నిర్థేశించింది. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాలు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతాలు ఈ నిషేధిత ప్రాంతాలలో ఉన్నాయి. అక్కడ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని పేర్కొంది. రవాణా కేంద్రాలు, మార్కెట్లు వంటి ఏరియాలలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవలం వాఘా బార్డర్ మాత్రమే సురక్షితమని అభిప్రాయపడింది. అలాగే పాక్ నుండి అమెరికాకు వచ్చే పౌరుల విషయంలో కూడా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు.