ముస్లీంల దేశభక్తిని శంకించోద్దు- ఓవైసీ
‘మదర్సాలో ఒక గదిని కూడా నిర్మించలేని మూర్ఖులు…బాంబులు తయారితో ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఎంఐఎం అగ్రనేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన మదర్సాల్లో ముస్లీంలకు దేశంపై విషం నింపుతున్నారని ఆయన హైదరాబాద్ లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశానికి శత్రువులు..ముస్లింలకూ కూడా శత్రువులేనని ఓవైసీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని, ముస్లింల దేశభక్తిని శంకించవద్దని అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల మృతుల్లో హిందువులే కాదు, ముస్లింలూ కూడా ఉన్నారని ఆయన ప్రస్తావించారు. ఇస్లాంలో ఆత్మహత్య నిషేధం.. అమాయకుల్ని చంపడం మహా పాపం అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దాడిలో హిందువులే కాకుండా ముస్లింలు కూడా చనిపోయారని, ఇది క్షమించరాని నేరమని ఓవైసీ చెప్పారు. దేశద్రోహులు 14 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని, ఉన్నత చదువులు చదివి మతానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, ముస్లింలపై అనవసర అపవాదాలు మోపేందుకు కారణమవుతున్నాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

