Andhra PradeshHome Page SliderPolitics

‘వైసీపీ రేప్‌లపై రాజకీయాలు చేస్తోంది’..హోం మంత్రి

ఏపీ శాసనమండలిలో మహిళలపై అఘాయిత్యాలు, రేప్‌లపై హాట్ హాట్‌గా వాదనలు జరిగాయి. వైసీపీ, టీడీపీ నాయకులు హోరాహోరీగా ఈ విషయంలో మీ పార్టీదే తప్పంటే, మీ పార్టీదే తప్పని వాదించుకున్నారు. లా అండ్ ఆర్డర్‌పై, రేప్ సంఘటనలపై రాజకీయాలు చేయొద్దని హోం మంత్రి అనిత అభ్యర్థించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. గతంలో పోలీస్ డిపార్టమెంట్‌ గానీ, దిశా చట్టం కానీ ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. దిశా యాప్‌కి గానీ, దిశా చట్టానికి గానీ ఎలాంటి చట్టబద్దత లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 150 రోజులలో గణనీయంగా నేరాలు తగ్గాయన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించమని, చివరికి జగన్ తల్లికి, చెల్లికి కూడా తమ ప్రభుత్వమే అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమాధానంపై మండిపడిన వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తాము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదని, దాటవేస్తున్నారని, రాజకీయ లబ్దితోనే హోం మంత్రి మాట్లాడుతున్నారని అందుకే తాము వాకౌట్ చేస్తున్నామని పేర్కొన్నారు.