Home Page SliderInternationalLifestyleNews AlertTrending Todayviral

స్విమ్ సూట్ పోటీలొద్దు..సీపీఆర్ టెస్ట్ ముద్దు..

బ్యూటీ కంటెస్ట్‌లలో క్యాట్ వాక్ మాత్రమే కాదు, సీపీఆర్ స్కిల్స్‌ను కూడా నేర్చుకోవాలంటున్నారు నిర్వాహకులు. అందం అంటే భౌతికమైనదే కాదు, తెలివికి కూడా సంబంధించినది అంటూ ఇన్నాళ్లూ ఇంటర్యూలలో పలు ప్రశ్నలు కూడా వేస్తూ టెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందానికి మంచి మనస్సూ, సహాయపడే వ్యక్తిత్వంతో పాటు గుండెపోటుతో విలవిల్లాడుతున్న వ్యక్తిని కాపాడే సీపీఆర్ కూడా తెలిసుండాలంటున్నారు మిస్ వరల్డ్ ఇంగ్లాండ్‌గా ఎంపికైన మిల్లా మాగీ. ఆమె ఆలోచనలను గౌరవించి ఇంగ్లండ్ పోటీలో ఈ రౌండ్ కాంపిటీషన్‌ను కండక్ట్ చేయనున్నారు. అంతేకాదు మిస్ ఇంగ్లాండ్ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులు ఇంగ్లాండ్ అంతటా సీపీఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. మిల్లా “సీపీఆర్‌ను బ్యూటీ విత్ ఎ పర్పస్” అనే తన ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ పాఠశాలలో శిక్షణ పొందాలని ప్రచారం చేస్తోంది. తన తాతలు, తండ్రులు ఈ ‘సీపీఆర్’ స్కిల్స్ లేకపోవడం వల్లే కోల్పోయామని పేర్కొన్నారు. అంతేకాక జరగబోయే 2025 మిస్ వరల్డ్ పోటీల కోసం ఆమె ప్రాజెక్టు ద్వారా చైతన్యం తీసుకువచ్చింది. ఈ ఏడాది పోటీలలో ఇదే హైలట్ కావచ్చు. మిస్ వరల్డ్ పోటీలు మే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.