Home Page SliderTelangana

నన్నంత గొప్పవాడ్ని చేయొద్దు.. ప్లీజ్- కేటీఅర్ కుమారుడు

కేటీఆర్ కుమారుడు హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడి వద్దకు వచ్చి, ప్రత్యేక పూజలు చేయించారు. ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడారు హిమాన్షు. తాను తన తండ్రి కేటీఆర్, తాత కేసీఆర్ అంత గొప్పవాడ్ని కాదని వినయంగా చెప్పారు హిమాన్షు. తన తల్లి శైలిమతో కలిసి పెద్దమ్మ తల్లి  దర్శనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని సేవాకార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు హిమాన్షు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిని ఆధునిక సౌకర్యాలతో తీర్చి దిద్దుతున్నారు. తన సేవా కార్యక్రమాలకు తన తాత కేసీఆరే ప్రేరణ అని చెప్పారు. పదిమందికి మంచి జరుగుతుందంటే మనకు కష్టమైన పనైనా చేయాలని కేసీఆర్ చెప్తూ ఉంటారన్నారు. తన తండ్రి కేటీఆర్ చాలా కష్టపడే వ్యక్తి అని, చాలా బిజీగా ఉంటారని, తాను అంత పని చేయలేనని, అంత గొప్పవాడ్ని చెయ్యొద్దన్నారు. తాను భవిష్యత్తులో మంచి బిజినెస్ మ్యాన్‌గా మారాలనుకుంటున్నానని, ఒక ఆపిల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని పెట్టాలని తన లక్ష్యమన్నారు. ప్రస్తుతానికి బాగా చదువుకోవడమే తన బాధ్యత అన్నారు.