ఆర్మీకి విరాళాలివ్వండి..కొత్తమోసం..
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడుతున్నారు. తాము ఆర్మీ అధికారులమని, ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు ఆర్థిక సహాయం చేయాలని అమాయక ప్రజలకు మెసేజ్‌లు పంపుతూ, విరాళాల అడుగుతున్నారు. ఈ మోసంపై తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ వలలో పడొద్దని నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ విరాళాల కోసం ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దేశభక్తి పేరుతో ప్రజల నుంచి డబ్బులు కాజేసే ఇలాంటి వారిని నమ్మొద్దని ప్రజలను హెచ్చరించారు. విరాళాలు ఇవ్వాలనుకుంటే అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం తీసుకోవాలని కోరారు.