Home Page SliderTelangana

సర్వే చేయడానికి వెళ్తే కుక్కలను వదిలేశారు

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న సిబ్బందికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న అపురూప, రమ్యశ్రీ.. అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదు చేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లారు. అయితే వారిపై ఇంటి యజమాని దుర్భాషలాడి, కుక్కలను వదలడంతో భయాందోళనకు గురైన వారు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తెలంగాణ పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.