గోపిరెడ్డికి సీటు ఉన్నట్టా లేనట్టా?
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వరంటూ అదే పార్టీలోని మరో వర్గం బాహాటంగా ప్రచారం చేస్తుంది. దీనికి అధికార పార్టీ నాయకులు సైతం వంత పాడుతుండటంతో గోపిరెడ్డి వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారంలో పెను దుమారం రేగుతోంది.నరసరావుపేట ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని గోపిరెడ్డి వర్గీయులు వాదిస్తుండగా,ఆయనకు వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సీటు ఇచ్చే ఆలోచనలో లేడని మరో వర్గం బలంగా వాదిస్తుంది.దీనికి తోడు టిడిపి నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్లు నిర్వహించి గోపిరెడ్డి భాగోతం ఇదీ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు.దీంతో గోపిరెడ్డి అనుచరులు ఫైర్ ..ఫైర్ విల్ బి ఫైర్…ఐయామ్ బి ఫైర్…ఐయామ్ బి ఫైర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ ప్రజలు గోపిరెడ్డి ని,ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని చెబుతున్నారు.పార్టీలోని కొంత మంది టిడిపి కోవర్టులు కారణంగానే ఓడిపోయారని, ఈ విషయాన్ని నరసరావుపేట ప్రజలు తెలుసుకున్నారని పేర్కొంటున్నారు.అసత్య ప్రచారాలు.. అబద్ధపు బతుకులతో కొంత మంది కాలం వెళ్ళదీస్తున్నారని అలాంటి వారందరికీ వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డి విజయమే చెంప పెట్టులా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా పొరుగునే ఉన్న సత్తెనపల్లి వైసీపి ఇంచార్జిగా.. పల్నాడు జిల్లా ప్రముఖ వైద్యులు గజ్జల బ్రహ్మారెడ్డి నియమించడంతో ఇక నరసరావుపేట వైసీపి ఇంచార్జి మార్పు కూడా అనివార్యమని భావిస్తూ ప్రచారానికి తెరతీశారు.ఈ నేపథ్యంలో గోపిరెడ్డి అనుచరులు తమ నాయకుడి సీటు విషయంలో ఇలా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

