దీర్ఘకాలిక జ్వరం కాన్సర్‌కు దారితీస్తుందా?
తరచూ జ్వరంతో బాధపడుతున్నారా? నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. జ్వరం తగ్గకుండా ఉంటే అది బ్లడ్ కేన్సర్‌కు సంకేతమంటున్నారు వైద్యులు. సాధారణ శరీర ఉష్ట్రోగ్రత కన్నా కొంచెం ఎక్కువ (100 డిగ్రీల ఫారెన్ హీట్ ) దీర్ఘకాలంగా తగ్గకుండా ఉంటే ప్రమాదమేనట. పైరెక్సియా అనేది కేన్సర్‌కు దారితీస్తుంది. మన రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్‌లపై పోరాడే సమయంలో ఈ పైరిక్సియా కనిపిస్తుందట. ఎక్కువగా బ్లడ్ కేన్సర్ బారిన పడినవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రక్త కేన్సర్, కాలేయ కేన్సర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు జ్వరం రావడం, ఒంట్లో నుండి వేడి ఆవిర్లు రావడం, చెమట పట్టడం వంటివి ఈ పైరోజెన్స్ కారణంగానే జరుగుగతుంటాయి. జ్వరం వస్తే ఇమ్యూనిటీ యాక్టివేట్ అయినట్లే. కానీ ఈ జ్వరం ఎక్కువరోజులు ఉండడం గుర్తిస్తే మాత్రం వైద్యుల వద్దకు వెళ్లి సమస్యను కనిపెట్టాలి. కేన్సరే కాదు, టీబీ ఉన్నా, కాలేయ సమస్యలున్నా ఇలా విడవకుండా జ్వరం వస్తూ ఉంటుందట.