ఆకుకూర స్కామ్‌లో డాక్టర్ సస్పెండ్..
తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాసుపత్రి డాక్టర్ శ్రీ పద్మావతి అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజే సస్పెండ్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ఆరోపణలు ఆకుకూర కొనుగోలుకు సంబంధించినవి కావడం. ఆమె రోగులకు ఆహారం అందించడానికి రూ.25 ఆకుకూర కట్టలను రూ.80 కి కొన్నట్లు చూపించారని విచారణలో తేలింది. దీనితో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తెన్కాశి ఆసుపత్రి నుండి కొద్ది నెలల క్రితమే తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి అధికారిగా బదిలీ అయ్యారు. మే 31న ఆమె పరదవీవిరమణ చేయాల్సి ఉండగా, గతంలో పనిచేసిన ఆసుపత్రిలో ఆరోపణలేమీ లేవని ధ్రువీకరణ పత్రం సమర్పించారు. అయితే అది నకిలీది కావడంతో తూత్తుకుడి ఆసుపత్రి వైద్యాధికారులు తెన్కాశిలో విచారించారు. దీనితో ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రం సంగతి తేలింది.