Home Page SliderNationalNews Alertviral

‘బెయిల్ కావాలా..పదవి కావాలా? తేల్చుకోండి’..మంత్రికి సుప్రీంకోర్టు షాక్

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతనికి మంత్రి పదవి కావాలా..బెయిల్ కావాలా తేల్చుకోమంటూ ఆప్షన్ ఇచ్చింది. 2023లో ఈడీ ఆయనను నగదు మోసం కేసులో అరెస్టు చేశారు. గత ఏడాది బెయిల్‌పై బయటకొచ్చిన మరునాడే ఆయనను తమిళనాడు ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి సత్కరించింది. దీనితో సెంథిల్ బాలాజీకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఆయన మంత్రి హోదాలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనితో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పుడు మంత్రి కావడానికి అనుమతినివ్వలేదని, ఆయనకు ఎలాంటి పదవి లేకపోవడం వల్లే బెయిల్ ఇచ్చామని పేర్కొన్నారు. బెయిల్ కావాలా.. మంత్రి పదవి కావాలా తేల్చుకోడంటూ సోమవారం వరకూ గడువు ఇచ్చారు.

Breaking news: పాక్‌పై భారత్ కీలక నిర్ణయాలు