Home Page Sliderhome page sliderInternational

లండన్ ఎయిర్ పోర్టు నుంచి కేటీఆర్ ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

మలిదశ ఉద్యమకాలంలో దశాబ్దం పాటు యునైటెడ్ కింగ్ డమ్ లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి, ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ అనిల్ కూర్మాచలం ఇంటికి లండన్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్ళి కేటీఆర్ పరామర్శించారు. అనిల్ ను ఆప్యాయంగా పలకరించి ఆయన ఆరోగ్య స్థితిపై వాకబు చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ అంటే అంతులేని అభిమానంతో, అత్యంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసే అనిల్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో మునుపటి జోష్ తో పాల్గొనాలని కోరుకున్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని కేటీఆర్ కు తెలిపిన అనిల్, తనను చూడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన యూకేలోని తెలంగాణ వాసులతో కేటీఆర్ ముచ్చటించారు.