HealthHome Page SliderInternationalLifestyleviral

‘మమ్మీ బ్రెయిన్’ అంటే తెలుసా..?

‘ఈ పిల్లలతో వేగలేకపోతున్నాం..ఒక్క క్షణం విశ్రాంతి లేదు’. అంటూ ప్రేమగా విసుక్కుంటుంటారు చిన్న పిల్లల తల్లిదండ్రులు. ఈ విషయంలో నిజంగానే పిల్లల్ని పెంచడం అంత కష్టమా? అనే కోణంలో యేల్ యూనివర్సిటీ సుమారు 40 వేల మందిపై పరిశోధనలు చేసింది. ఈ సర్వేలో వారు ఒక వినూత్న సంగతిని తెలుసుకున్నారు. పసి పిల్లలు, చిన్నపిల్లలున్న తలిదండ్రులలో మెదడులో కీలకమైన భాగాలు మరింత చురుగ్గా పనిచేస్తాయిట. అయితే పిల్లలు పుట్టిన కొత్తలో మాత్రం తల్లిలో మతిమరుపు లక్షణాలు కనిపిస్తాయని, దానిని మమ్మీ బ్రెయిన్ అంటారు. అయితే ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమేనని, పిల్లలు పెరిగేకొద్దీ వారి మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు, ఒకే సంతానం ఉన్న తల్లిదండ్రుల కంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది పిల్లలున్న వారి మెదడు మరింత వేగంగా పనిచేస్తుందట. అలాగే పిల్లల పెంపకం ఒత్తిడిని తగ్గిస్తుందని, త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చేస్తుందని పేర్కొన్నారు.