కోమాలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసా?
కొన్ని సార్లు ప్రమాదం వల్లో, అనారోగ్యం వల్లో, మరే కారణం వల్లనో కోమాలోకి వెళ్లిపోయారంటారు. కోమా స్థితిలో మనిషి మనఃస్థితి ఎలా ఉంటుందో అనే కుతూహలంతో కొందరు ప్రయోగాలు చేశారు. కోమాలో వ్యక్తులు బయటి వ్యక్తుల మాటలు వినగలరని, శరీరాన్ని కదిలిస్తారని కొందరు చెప్తుంటారు. కానీ వారికి ఎలాంటి స్పందనలు ఉండవని వైద్యులు చెప్తున్నారు. వారికి ఎలాంటి మాటలు వినిపించవని, కదలికలున్నా వాటికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదని చెప్తున్నారు. వారి శరీరానికి నొప్పి, స్పర్శ వంటివి కూడా ఉండవంటారు.

