HealthHome Page SliderNational

ధనియాల కషాయం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

మన కుటుంబాలలో అనాది కాలం నుండి సర్వరోగ నివారిణిగా పేరు పొందిన ధనియాల కషాయం తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు కూడా పరిశోధనలలో తేల్చారు. ఈ కషాయంలో శక్తివంతమైన ఔషధ గుణాలున్నాయని పేర్కొన్నారు. ధనియాల గింజలు నీటిలో వేసి, బాగా మరగకాచిన నీరును కషాయంగా తాగవచ్చు. జ్వరం ఎంతకీ తగ్గకపోతే ఈ కషాయం తాగడం వల్ల తొందరలోనే నార్మల్ టెంపరేచర్ వస్తుంది. విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఈ కషాయంలో ఉంటాయి. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను పారద్రోలుతుంది. ఈ ద్రావణాన్ని ఎప్పుడైనా తాగవచ్చు. కానీ ముఖ్యంగా ఉదయం పూట తాగినా, భోజనానికి గంట ముందుగా తాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.