జింక్ లోపం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
శరీరంలో ఏ విటమిన్ లోపించినా రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కానీ ముఖ్యమైన శారీరక విధులకు మూలకారణం జింక్. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, గాయాలు నయం చేసే గొప్ప లక్షణం ఉన్న మూలకం జింక్. జింక్ లోపం ఉంటే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. జింక్ లోపం శరీరాన్ని అనేక సమస్యలకు గురిచేస్తుంది. జింక్ లోపం ఉంటే ఇన్‌ఫెక్షన్లు, గాయాలు ఓ పట్టాన తగ్గవు. జుట్టు రాలడం, చర్మసమస్యలు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. తరచుగా జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాలు తలెత్తుతాయి. అంటువ్యాధులు కూడా చాలా ఈజీగా వస్తూంటాయి. గాయాలు మానడానికి చాలా సమయం తీసుకుంటుంది. జుట్టు రాలడం కూడా జింక్ లోపం వల్ల రావచ్చు. కుదుళ్లు బలహీనపడతాయి. జింక్ లోపం వల్ల ఆకలి కూడా మందగిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, చర్మసమస్యలు కూడా జింక్ లోపాలను సూచిస్తాయి. జింక్ లోపాన్ని నివారించాలంటే గుమ్మడిగింజలు, శనగలు, సీఫుడ్ వంటి ఆహారం తీసుకోవడం వల్ల సమస్య తీరుతుంది. మాంసం, చిక్కుళ్లు, ప్రొటీన్, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటి ఆహారం తినడం వల్ల శరీరానికి కావలసిన జింక్ అందుతుంది.

