నటి హేమ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా…?
టాలీవుడ్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్‌గా ప్రసిద్ధి పొందిన హేమ. 1993లో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆమె సుమారు 350-400 సినిమాలు నటించారు. తెలుగు సినిమాల్లో పలు గుర్తించదగిన పాత్రలను పోషించింది. బిగ్ బాస్ వంటి ప్రముఖ టీవీ రియాలిటీ షోలో కూడా పాల్గొంది, అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది . టీవీ, సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమ 2021లో క్రేజీ అంకుల్స్ సినిమాలో కనిపించినప్పటికీ, ఇటీవల సినిమాలకు కాస్తా దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా హేమకు సంబంధించి ఓ వార్త హాట్ హాట్ గా మారడంతో వైరల్ గా మారింది.

హేమ, హైదరాబాద్ లో ఓ షాప్ ఓపెనింగ్‌లో పాల్గొన్నప్పుడు, ఆమె సినిమాలలో నటించను అన్న వ్యాఖ్యలు చేసింది. నేను సినిమాల్లో నటించడం మానేశాను. ఇప్పుడు నా జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. 14 ఏళ్లపాటు కష్టపడ్డా.. ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. నేను నా కోసం జీవించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నాకు బోర్ కొట్టినట్లుగా అనిపిస్తే, అప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాను. నాకు శివగామి లాంటి పాత్రలు ఇచ్చినా..నటించను అన్నారు. ఆమెపై సంవత్సరాల క్రితం బెంగళూరులోని డ్రగ్, రేవ్ పార్టీల్లో పాల్గొనడం అనే ఆరోపణలు వచ్చాయి. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల పాటు జైలులో కూడా గడిపింది. హేమ నిర్దోషిగా తనను ప్రకటించింది. ఈ వివాదం వల్ల ఆమెపై నెగెటివిటీ నెలకొంది, మరియు సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ చేశారు.ఈ మధ్య, హేమ నటించడానికి పూర్తిగా దూరంగా ఉంటున్నా, ఆమె ఈ నిర్ణయం గురించి వెబ్, మీడియా లో ప్రశ్నలు ఎదురైనప్పుడు, తన వ్యక్తిగత జీవితంపై ఉన్న దృష్టిని మరింత బలంగా వ్యక్తం చేసింది.