Home Page SliderNational

UPSC ఫస్ట్ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్ మీకు తెలుసా?

దేశంలో ఎంతో అత్యుత్తమంగా భావించే సివిల్ సర్వీసుల్లో అర్హత సాధించాలని ఎంతోమంది యువత కొన్ని ఏళ్లపాటు సాధన చేస్తుంటారు. అయితే  దేశంలోని కష్టమైన పరీక్షల్లో మొదటి స్థానంలో ఉండే సివిల్  పరీక్షల్లో అర్హత సాధించడం అంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పొచ్చు. కాగా ఇటువంటి పరీక్షల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అయితే తాజాగా విడుదలైన సివిల్స్ -2022 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు ఇషితా కిషోర్. ఆమె తన విజయ రహస్యాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. “ఇది జరగడానికి ఏం పనిచేసిందో తెలియదు. కానీ వ్యక్తిగతంగా మెయిన్స్ పరీక్షలకు సాధన చేయడం,గతేడాది ప్రశ్నాపత్రాలను చూడడం వంటివి విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. అంతేకాకుండా వార్తాపత్రికల నుండి నోట్స్ తయారు చేసి వాటిని చదవడం.ఇవన్నీ కలిసి సివిల్స్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించేందుకు ఉపయోగపడ్డాయని భావిస్తున్నానని” ఇషిత కిషోర్ ట్వీట్ చేశారు.