HealthHome Page SliderInternationalLifestyleNational

కరివేపాకు చేసే మేలు గురించి మీకు తెలుసా …?

కరివేపాకు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల పప్పు, పచ్చడి లో మనం కరివేపాకును బాగా వాడుతాము. కొంత మంది దానిని తీసివేసి తింటారు. అలా తినడం వల్ల ప్రయోజనం ఏమి లేదుంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో పిల్లలకు చాల తక్కువ ఏజ్ లోనే వైట్ హెయిర్ రావడం మరియు గ్యాస్ సమస్యలు , గుండెపోటు ,ఇంకా రకరకాల సమస్యలు వస్తున్నాయి. కరివేపాకు తీసుకుంటే చాలా లాభాలున్నాయి. అంతేకాదు ఖాళీ కడుపుతో రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులను నమిలితే… మీరే మార్పులు గమనిస్తారు. కరివేపాకులో డైజెస్టివ్ ఎంజైములు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.అంతేకాకుండా కరివేపాకులలోని బీటా-కెరోటిన్, ప్రొటీన్ల వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణను అందించి బలంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.