రాచకొండ క్రైమ్ రేటెంతో తెలుసా?
ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో డ్రగ్స్ కేసులు నమోదైనట్లు రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్‌బాబు తెలిపారు.ఈ మేరకు ఆయన సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైంకి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది 253 డ్రగ్స్ కేసుల నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసుల్లో 521 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రూ.88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన పలువురు నిందితులను కోర్టుల్లో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 30 మందికి జీవిత ఖైదు విధించారని చెప్పారు. లోక్ అధాలత్‌లో 11 వేలకుపైగా కేసులను పరిష్కరించాం సీపి తెలిపారు.