టీ 20 వరల్డ్ కప్ టిక్కెట్లు ఎంతో తెలుసా?
భారత్, శ్రీలంక దేశాలు ఉమ్మడిగా నిర్వహించబోతున్న ఐసీసీ టీ 20 మెన్స్ 2026 పోటీలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టిక్కెట్లను గురువారం సాయంత్రం ఐసీసీ రిలీజ్ చేసింది. భారత్ లో ఫేజ్ వన్ టిక్కెట్లు ఖరీదు కేవలం రూ.100 నుండి ప్రారంభం కావడం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే శ్రీలంకలో మాత్రం రూ.295 నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకూ ఈ టోర్నీ కొనసాగుతుంది.

