మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో మీకు తెలుసా …..!
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో అందరికి కంటికి సరిపడా నిద్ర ఉండటం లేదు. ఉదయం లేచినప్పుడు నుంచి ఈ జీవితం ఉరుకు పరుగులతో సాగిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. అలా నిద్ర పోకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. నిద్ర సరిగాలేకపోవడం వల్ల కలిగే ముఖ్య సమస్య ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి బాగా ఆకలేస్తుంది. దీని వల్ల బరువు పెరిగి ఊబకాయం సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇది హార్ట్‌స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణం. ఈ సమస్య క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది. మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ప్రతి మనిషి రోజుకి కనీసం 7 గంటలు నిద్రపోవాలని డాక్టర్స్ చెప్తున్నారు.