పీచ్ పండు గురించి మీకు తెలుసా…దాని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో…..?
పీచ్ అనే ఒక పండు ఉన్న సంగతి కూడా సాధారణంగా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది చూడడానికి కొంచెం ఆపిల్ లాగానే అనిపిస్తుంది. పీచ్ పండు తెలుగులో పీచు పండు అని పిలుస్తారు. ప్రస్తుతం వీటి సీజన్ స్టార్ట్ అయ్యింది . పీచెస్ ఒక సీజనల్ ఫ్రూట్ కాబట్టి చాలా అరుదుగా దొరుకుతుంది. దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ్. జ్యూస్ రూపంలో చేసుకుని తాగినా లేక తిన్నా మంచిది. ఇది చాలా తియ్యగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండు తింటే చాలు చాల సులభంగా బరువు తగ్గచ్చు.
అంతే కాదు ఇందులో క్యాన్సర్‌ను దూరం చేసే గుణాలు కూడా ఉన్నాయి. కంటి సమస్య మెరుగు పడుతుంది. పీచ్ లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని తింటే కంటి చూపు అనేది మెరుగు పడుతుంది. క్యాటరాక్ట్ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా పీచ్ పేస్టు చేసి పేస్ కి అప్లై చేసుకున్న మంచిది . మొఖం మీద ఉన్నా మచ్చలు పోవడానికి సహాయపడుతుంది . ఇందులో వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.