మీరు చదువుతున్నప్పుడు నిద్ర ముంచుకొస్తోందా?
చాలా మందికి ఏదైనా పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే నిద్ర మత్తులోకి జారుకుంటారు. వాస్తవానికి చదువుతున్నప్పుడు మన కళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అటువంటి పరిస్థితిలో కళ్ల కండరాలు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో మెదడు కష్టపడి పని చేయడానికి నిరాకరిస్తుంది. దీంతో నిద్రలోకి జారిపోతాము. మన శరీరం చాలా వరకు చదువుకొనేటప్పుడు రిలాక్స్ గా మారుతుంది. కళ్లు, మెదడు మాత్రమే పని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో శరీర కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఫలితంగా నిద్ర మొదలవుతుంది. చదువుకొనేటప్పుడు నిద్ర రాకూడదంటే ఒకే భంగిమలో కూర్చుని చదవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మందికి చదువుతున్నప్పుడే కాకుండా.. కారులో ప్రయాణించినప్పుడు కూడా నిద్ర తన్నుకుంటూ వస్తుంది. ప్రయాణంలో నిద్రిస్తున్న వారికి ఇదే కారణం దాగి వుంది. చదువుకొనేటప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే.. చదువుకునే ప్రదేశం మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. మంచం మీద కూర్చొని ఎప్పుడూ చదవకూడదు. దానికి బదులుగా కుర్చీ, టేబుల్ మీద చదువుకోవాలి. దీంతో చదువుకు మనసు సిద్ధమై బద్దకాన్ని వదిలివేస్తుంది. చదువును ప్రారంభించే ముందు తేలికపాటి భోజనం చేయడం మంచిది. తద్వారా మీకు నీరసంగా అనిపించదు. ఇలా చేయడం వల్ల మీరు నిద్రను తరిమికొట్టవచ్చు.

