HealthNational

మీరు కూడా చికెన్ తిని పెరుగు తింటున్నారా..?

చాలా మంది వారానికి ఒక్కసారైనా చికెన్ తింటారు. ప్రసుత్తం అయితే ఇంట్లో ఆడవాళ్లు వంటలు చెయ్యాడని ఇష్టపడరు వారానికి ఒక్కసారైనా ఆర్డర్ లు చేసుకుంటారు. నెలకి ఒకసారి చికెన్ తింటే పర్వాలేదు ,కానీ కొంత మంది దానిని అధికంగా తింటారు అలా తినడం వల్ల ఆరోగ్యానికి చాల ప్రమాదకరం. అయితే చికెన్ తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ చికెన్ తో పాటు పెరుగు తినడం అంత మంచిది కాదని డాక్టర్స్ చెప్పారు. ముఖ్యంగా చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. పెరుగుతో చికెన్ తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు తెలిపారు.అంతేకాకుండా చాలామంది చికెన్‌, పాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయంటున్నారు. చాలా మందికి డైలీ పాలు తాగే అలవాటు ఉంటుంది. చికెన్ తినే రోజు పాలు తాగకపోవడమే మంచిదని డాక్టర్ చెబుతున్నారు. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి.