కష్టమొచ్చిందని వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటామా?
కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని,కష్టం వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకుండా పోరాడేవారే ధైర్యవంతులని ఏపి మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కడప పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం పులివెందులకు వచ్చారు.ఈ సందర్భంగా అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవిమాలిన హామీలను ప్రజలను నమ్మి మోసపోయారని, నిజం చెప్పి మనం ప్రతిపక్షంలో ఉన్నామని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పుడు అన్నీ అర్ధం చేసుకుకుంటున్నారన్నారు. 2027లో జమిలి ఎన్నికలు ఉండబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ కచ్చితంగా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వారికి,ప్రతిపక్ష అరాచకాలపై అన్నీ విధాలుగా పోరాటం చేసే వారి రాబోవు కాలంలో పార్టీలో పెద్ద పీట వేస్తామని జగన్ స్పష్టం చేశారు.

