HealthHome Page SliderNational

బరువు తగ్గడానికి ఇలాంటి పనులు చేయకండి..

బరువు తగ్గడానికి కొందరు కఠిన డైట్స్ ఫాలో అవుతుంటారు. పరగడుపునే నిమ్మకాయనీరు తాగడం, చియా సీడ్ వాటర్ తాగడం చేస్తే ప్రమాదమే అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజంతా ఓట్స్, పండ్లు, సలాడ్లతో గడపడం కూడా అంత మంచిపద్దతి కాదంటున్నారు. త్వరగా సన్నబడాలంటూ క్రాష్ డైట్లు ఫాలో అయితే కొత్త ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొంటున్నారు. అన్నం, చపాతీలు వంటి సాంప్రదాయ ఆహారాన్ని మానేయడం ఆరోగ్యానికి చేటు తెస్తుందట. డైట్ల పేరుతో నీరసంతో డీహైడ్రేషన్‌కు గురవుతామని, శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ కొవ్వును తీసుకోవడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, నీరసం, శరీరంలో మెరుపు తగ్గి, వృద్దాప్య లక్షణాలు త్వరగా రావడం వంటి ప్రమాదాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే శరీరానికి కావలసిన పోషకాహారం తీసుకుంటూనే, తగినంత శ్రమ ఇస్తూ నిదానంగా బరువు తగ్గే మార్గాలు చూసుకుంటే మంచిదని పోషకాహార నిపుణుల సలహా..