Home Page SliderInternationalSpiritual

చిన్నారులను హజ్ యాత్రకు తీసుకురావద్దు..

ఇకపై చిన్నారులకు హజ్ యాత్ర ప్రవేశం లేదని నిషేధం విధించింది సౌదీ అరేబియా. ఈ యాత్రకు చిన్న పిల్లలను తీసుకువచ్చి, యాత్రలో జరిగే అనూహ్య ప్రమాదాల బారిన పడేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముందుగానే చిన్నారులను తీసుకురావద్దంటూ హెచ్చరించింది సౌదీ ప్రభుత్వం. ఈ సారి యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అత్యాధునిక టెంట్లు, నడకదారులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది.