Home Page SliderNational

కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ గురించి 5 ముఖ్యమైన విషయాలు

విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న డీకే
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు

కర్నాటక కాంగ్రెస్‌ ప్రముఖులలో డీకే శివకుమార్‌ ఒకరు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ట్రబుల్షూటర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్), కలిసి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. వక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. 1985 అసెంబ్లీ ఎన్నికలలో సాథనూర్ స్థానం నుండి హెచ్‌డి దేవెగౌడపై పోటీ చేసి ఓడినా ఆ తర్వాత ఎన్నికల్లో కుమారస్వామిపై విజయం సాధించాడు. కర్నాటకలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు డీకే సన్నిహితుడు.

కాంగ్రెస్ నాయకుడి గురించి ఐదు అంశాలు

1) డీకే శివకుమార్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 1985లో, కాంగ్రెస్ టిక్కెట్‌పై సాతనూర్ స్థానం నుండి పోటీ చేసి, దేవెగౌడ చేతిలో ఓడిపోయాడు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపొందారు. అప్పట్నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2008లో కనకపుర సీటును గెలిచి 2013, 2018లో నిలబెట్టుకున్నారు.
2) మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. కర్నాటక ఇంధన శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
3) శివకుమార్ 1999 ఎన్నికలలో హెచ్‌డి కుమారస్వామిపై పోటీ చేసి 14,000 ఓట్లతో గెలుపొందారు.
4) 2020లో శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
5) సోదరుడు DK సురేష్, బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.