డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన కేసులో మధ్యంతర స్టే ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను జూలై 14 తేదీకి అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కారోల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డీకే శివకుమార్ తరుఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.


 
							 
							