భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న డీకే శివ కుమార్
కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడంపై ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. మీడియాతో మాట్లడిన శివకుమార్ భావోద్వేగం అవుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చారన్నారు. వారికి ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు శ్రమించారని గుర్తు చేశారు. సమష్టి కృషితో ఎన్నికల్లో గెలిచామన్నారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యత.. ప్రజా విజయమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

