రాజన్న ఆలయంలో కోడె దూడల పంపిణీ
టిజి: వేములవాడ రాజన్న ఆలయంలో కోడె దూడల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. 6 నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 511 మంది రైతులకు రెండు కోడె దూడల చొప్పున పంపిణీ చేశారు. కోడె దూడలను ఇతరులకు అమ్మబోమని, తామే సాకి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని రైతుల నుండి అంగీకారపత్రం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

