చంద్రబాబు, పవన్ చర్చలు..నాగబాబుకు కీలక పదవి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చాలాసేపు చర్చలు జరిపారు. పలు అంశాలపై చర్చించిన వీరిద్దరూ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై కాసేపు చర్చించారు. ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాలలో ఒకటి నాగబాబుకు ఖరారు చేసినట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితమే నాగబాబు మండలికి వెళతారన్న ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్సీలను ఎంపిక చేస్తున్న సందర్భంగా నాగబాబు ఎన్నికపై పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై కూడా వారిద్దరూ అభిప్రాయాలు పరస్పరం పంచుకున్నారు.

