Home Page SliderInternationalNews AlertPoliticsTrending Todayviral

ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో చర్చ..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెట్టా. పాక్ డెమోక్రసీ యాక్ట్ పేరిట దీనిని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నిట్ స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటుబులిటీ యాక్ట్ కింద ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయకక్షతోనే జైలుపాలు చేశారని, ఆయన రాజకీయ ఖైదీ అని స్పష్టంగా తెలుస్తోందన్నారు. పాక్‌లో ప్రజాస్వామ్యం నెలకొల్పి ఇమ్రాన్‌ను విడుదల చేయాలని కోరారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో జోక్యం చేసుకుని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచాలని వారి వీసాపై బ్యాన్ విధించాలని కోరారు. అమెరికాలోని ఇరు పార్టీలు ఇమ్రాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేయడం విశేషం. ట్రంప్ స్పెషల్ మిషిన్స్ దూత రిచర్డ్ గ్రినెల్ కూడా ఇమ్రాన్‌కు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు.