రాజగోపాలరెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూస్తుంది
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, రాజగోపాల్ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని, ఇప్పటికే తాను కమిటీకి ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. రాజగోపాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటో ముందుగా తెలుసుకుంటామని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని, త్వరలోనే స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. అలాగే మార్వాడీలు మనలో భాగమని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని తెలిపారు.