“నిరాశ చెందిన.. మా తలలు ఎప్పుడూ దించము”: కోహ్లీ
ఈ IPL సీజన్‌లో అయినా RCB కప్పు గెలుస్తోందని కోటి కళ్లతో ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. మొన్న జరిగిన RCB VS GT మ్యాచ్‌లో RCB ఓటమి పాలయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను పోగొట్టుకొని ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విరాట్ కోహ్లీ మొదటిసారి స్పందించారు. “దురదుష్టవశాత్తు మేము మా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. నిరాశ చెందినా..మా తలలు ఎప్పుడూ దించము. మాపై నమ్మకం ఉంచుకున్న మద్దతుదారులకు,మాకు అడుగడుగునా మద్దతు ఇస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు” అని కోహ్లీ ట్వీట్ చేశారు.అంతేకాకుండా ఈ IPL సీజన్‌లో మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఫోటోలను షేర్ చేశారు.