సౌందర్య కారణంగా స్టార్ జంట మధ్య మనస్పర్థలు…!
లెజెండరీ నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తెలుగులో అనేక చిత్రాలు నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో స్టార్ నటులతో కలిసి నటించారు. ఇక ఆమె 1998లో నటించిన అంతఃపురం చిత్రం ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచి 9 నంది అవార్డులు, 3 ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో సౌందర్య తన నట విశ్వరూపం చూపించారు.
అయితే ఈ చిత్రంలో సౌందర్య నటనని చూసి ఒక స్టార్ కపుల్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన సతీమణి అయిన స్టార్ నటి రమ్యకృష్ణ చూసి ఆ సినిమాలో నన్నెందుకు తీసుకోలేదు అని గొడవపడ్డారట. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు ఈ ప్రశ్న తననే అడగండి అని కృష్ణవంశీ అన్నారు.