కన్నీళ్లు పెట్టుకున్న డైరక్టర్ సుకుమార్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. బన్నీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి సినీ పరిశ్రమకు చెందిన పలువురు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆయనను కలిశారు. సంఘటనకు కారణమైన పుష్ప-2 చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌ను కలిసి, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తీవ్ర దుఃఖంతో బన్నీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనితో బన్నీ ఆయనను సముదాయించారు. బన్నీని చూడడానికి దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు దిల్‌రాజు, రవి, నవీన్, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు కలిశారు.

