Home Page SliderNews AlertTelanganatelangana,

స్కైవాక్ ద్వారా నేరుగా మెట్రో స్టేషన్లకు..

హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద త్వరలోనే స్కైవాక్‌లు కనువిందు చేయబోతున్నాయి. మాల్స్, వాణిజ్య భవనాల దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ల నుండి నేరుగా ఆయా భవనాలలోకి రాకపోకలు సాగించే విధంగా స్కైవాక్ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు మెట్రో రైలు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద నుండి రహేజా మైండ్ స్పేస్‌కు వెళ్లడానికి ఏర్పాటు చేసిన స్కైవాక్ తరహాలోనే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు వేస్తున్నారు. వీటివల్ల ట్రాఫిక్ రద్దీని, వాహన కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు. ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిలా, సికింద్రాబాద్ స్టేషన్, రాయదుర్గం, ఉప్పల్, జేబీఎస్ మెట్రోలకు స్కైవాక్‌ నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన మెట్రో స్టేషన్లకు కూడా త్వరలోనే ఇలాంటి స్కైవాక్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి.