HealthHome Page SliderInternationalNews

వణికిస్తున్న మరో మహమ్మారి ‘డింగా డింగా’

ప్రపంచమంతా కొత్త సంవత్సరం సంబరాలకు సిద్దమవుతున్న వేళ ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ‘డింగా డింగా’ అనే మహమ్మారి బయటపడింది. ఇప్పటికే దాదాపు 300 మందికి ఈ వింత వ్యాధి సోకిన్నట్టుగా సమాచారం. ఈ ప్రాణాంతక వైరస్ ఎక్కువగా మహిళలు, టీనేజ్ అమ్మాయిలలో కనిపిస్తుంది. ఈ వ్యాధిపై ఐక్యరాజ్యసమితి స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ వైరస్ సోకిన వారిలో ముందుగా జ్వరం వస్తుంది. శరీరమంతా వణికిపోతుంది. వ్యాధి సోకిన ఉగాండా మహిళలు డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే దీనిని ‘డ్యాన్సింగ్ వైరస్’ అని కూడా అంటున్నారు.  ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా కరోనా వంటి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని నిపుణులు సూచించారు.