సినీ పరిశ్రమపై దిల్ రాజు కామెంట్స్
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దీనిలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజ్ సినీ పరిశ్రమపై కీలక కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎవరికీ సపోర్టు చేయరని, తమని తామే టాలెంట్‌తో నిరూపించుకోవాలని, అప్పుడే సక్సెస్ అవుతారని పేర్కొన్నారు. కిరణ్ తమ చిత్రాన్ని సెలబ్రిటీలు సపోర్టు చేయట్లేదని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచానికంతటికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. మన కృషి, హార్డ్‌వర్క్ మనల్ని నిలబెడతాయి. అంటూ దిల్ రాజు తెలిపారు.