ఐటీ విచారణకు దిల్ రాజు
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపారాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనితో ఆయన నేడు ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఐటీ అధికారులకు సమర్పించారు. సంక్రాంతి సమయంలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు విజయవంతం కావడం, లాభాల విషయంలో ఆరాలు తీసినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు జరిగిన సోదాలపై ఇటీవల దిల్ రాజు స్పందించారు. “సోషల్ మీడియాలలో డబ్బు దొరికింది. డాక్యుమెంట్లు దొరికాయి అంటూ హడావిడి చేస్తున్నారు. నిజానికి అలాంటివేమీ లేవు. మా వద్ద ఎలాంటి అనధికార డాక్యుమెంట్లు లేవని” ఆయన క్లారిటీ ఇచ్చారు.

